గంజ్ వ్యాపారులకు ఎప్పుడూ అండగా ఉంటా..
తాండూరుకు ఆధునిక మార్కెట్ యార్డ్ తీసుకువస్తాం”
ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
వికారాబాద్:
తాండూరు ది గ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ 2026-28 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. బుధవారం తాండూరు పట్టణంలోని సల్లా గార్డెన్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంకు
ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరై కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా కట్కం వీరేందర్, ఉపాధ్యక్షులుగా బానకారి క్రిష్ణ, కార్యదర్శిగా దర్మీది ప్రభు, సహాయ కార్యదర్శులుగా నాగారం జగదీశ్వర్, కోశాధికారిగా సీహెచ్ భోజిరెడ్డి ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. అలాగే కార్యవర్గం సభ్యులైన ఎన్. జైపాల్ రెడ్డి, కల్వ రాధాకృష్ణ, బంటారం సుధాకర్, చామ్‌కూర్ విశ్వనాథ్, బిక్కుమళ్ల శ్రీధర్, రాజేష్ సోని, దీనేష్ సింగ్, మంకాల రవీందర్, టి. బాలేశ్వర్ గుప్త, మల్లేపల్లి మధుసూదన్ లు ప్రమాణం చేశారు. ఈ క్రమంలో
నూతన అధ్యక్షులు కట్కం వీరేందర్, కార్యదర్శి దర్మీది ప్రభులు మాట్లాడుతూ.. అసోసియేషన్ అభివృద్ధి కి కృషి చేస్తామని, ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి పనిచేస్తామని తెలిపారు.
ఈ సందర్భంగ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు గంజ్ వ్యాపారులతో నాకు మంచి స్నేహం అనుబంధాలు ఉన్నాయని తెలిపారు. వ్యాపారులకు ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కారానికి ముందుంటానని హామీ ఇచ్చారు. వ్యాపారుల సౌకర్యార్థం కోసం తాండూరులో ఆధునిక మార్కెట్ యార్డును అందుబాటులోకి తీసుకొని
వస్తామని అన్నారు.
అనంతరం అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని గజమాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్, మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, మాజీ చైర్‌పర్సన్ స్వప్న పరిమళ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, టీపీపీసీ ప్రచార కార్యదర్శి కరణం పురుషోత్తం రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్, కౌన్సిలర్లు, అసోసియేషన్ మాజీ సభ్యులు, వ్యాపారులు, ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


