Saturday, October 10, 2026
Google search engine
Homeఇంటర్నేషనల్డంపింగ్ యార్డ్ మార్చాలని స్ధానిక ప్రజల వినతి

డంపింగ్ యార్డ్ మార్చాలని స్ధానిక ప్రజల వినతి

  • భరించలేని కంపుతో బతకలేమని ఆవేదన
  • పీసీబీ అధికారితో కలిసి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పర్యటన

ఎల్బీనగర్:

ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మన్సురాబాద్ డివిజన్ పరిధిలోని డంపింగ్ యార్డ్ ప్రాంతంలో చుట్టుపక్కల దాదాపు ఇరవై కాలనీవాసులతో, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారి వెంకట నరసయ్యతో కలిసి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా బాధిత కాలనీవాసులు మాట్లాడుతూ, ఈ డంపింగ్ యార్డ్ నుంచి ప్రతిరోజు నీచమైన, దుర్గంధమైన వాసన వస్తుందని సుధీర్ రెడ్డికి తెలిపారు.వాసన రాకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. డంపింగ్ యార్డ్ నుంచి వెలువడుతున్న రక్తం, కొవ్వు పదార్థాలు, మురుగునీటి వల్ల పరిసర కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వర్షం పడినప్పుడు ఈ వ్యర్థాలు కలుషితమై తీవ్ర దుర్వాసన వెలువడుతోందని దీని కారణంగా 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు శ్వాస సంబంధిత సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, దుర్వాసనను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు.అనంతరం సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో ఆరు కోట్ల రూపాయలతో స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిర్మించడం జరిగిందని, డంపింగ్ యార్డ్ నందు ఎక్కడెక్కడ నుంచో ట్యాంకర్లు వ్యర్థ రసాయనాలు తీసుకొచ్చి ఇక్కడ వదలడం జరుగుతుందని నా దృష్టికి తీసుకువచ్చిన నేపద్యంలో అప్పటి అధికారులతో మాట్లాడి సిసి.కెమెరాలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.అలాగే ఇక్కడ చెత్త వేసే లారీలను గుర్తించి పెద్ద ఎత్తున జరిమానా విధించడం జరిగిందని తెలిపారు.అందులో భాగంగా గతంలో హైడ్రా, జీహెచ్‌ఎంసీ,ఫారెస్ట్,హైలా వంటి సంబంధిత శాఖాధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి అక్కడ నిల్వ ఉన్న మురికినీటిని తరలించేందుకు వెంటనే ట్యాంకర్లను ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు.అలాగే జంతు కళేబరాలు, వ్యర్థ పదార్థాలు వేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.ఆ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వాసన రాకుండా పర్యవేక్షణను బలోపేతం చేసి దీనికి అనుగుణంగా అధికారులతో మోటార్లు ఏర్పాటు చేసి నిల్వ ఉన్న మురికినీటిని తరలించడం జరిగింది అని తెలిపారు. అలాగే ఆటో నగర్ పారిశ్రామిక ప్రాంతంలోని కెమికల్,ఫర్టిలైజర్ గోడౌన్స్, మెకానికల్ షెడ్డులు అన్నీ తనిఖీ చేసి ఎవరైతే డ్రైనేజీ లైన్ల ద్వారా వ్యర్థ పదార్థాలు,రసాయనాలు పారబోస్తున్నారో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.అలాగే అక్కడ ఒక వాచ్మెన్ కూడా గతంలో నియమించడం జరిగిందని తెలిపారు.అలాగే ఎస్టిపి ప్లాంట్స్ కూడా నిర్మించడం జరిగిందని గుర్తు చేశారు. ఇప్పటివరకు దాదాపు 90 శాతం పనులు నేనే చేయడం జరిగిందని కాలనీవాసులకు గుర్తు చేశారు.కానీ కొందరు కాలనీవాసులు సుధీర్ రెడ్డిని విమర్శిస్తూ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని కొన్ని గ్రూపులలో మాట్లాడడం తగదని హెచ్చరించారు.కానీ ఏది ఏమైనా ఈ డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల కాలనీవాసులకు దుర్వాసన నుంచి విముక్తి కలిగిస్తానని హామీ ఇస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ విఠల్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు జక్కిడి మల్లారెడ్డి, టంగుటూరి నాగరాజు, జగదీష్ యాదవ్, జక్కిడి రఘువీర్ రెడ్డి, సంతోష్ గుప్తా, రవి, బాలరాజుతో పాటు డంపింగ్ యార్డ్ ప్రభావిత కాలనీల అధ్యక్షులు అంజయ్య గౌడ్, గోపి కృష్ణరెడ్డి, రమేష్,రవి, విజయ, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments