రెండు రోజులుగా మురుగు నీటితో ఇబ్బందులు.. దుర్వాసనతో స్థానికుల అవస్థలు
ఎల్బీనగర్:
కాలనీ రోడ్డు మొత్తం మురుగు నీటితో నిండి ఉన్నా, రెండు రోజుల నుండి డ్రైనేజీ కారిపోయి ఇబ్బందులు పడుతున్నామని పిర్యాదులు చేసినా ఇటువైపు కన్నెత్తి చూడని జలమండలి అధికారులు. సరూర్ నగర్ డివిజన్ శ్రీనివాస కాలనీ రోడ్ నెంబర్ 1/ఏ లో రెండు రోజులుగా డ్రైనేజీ నీరు రోడ్డుపైకి పొంగిపొర్లుతున్నా జలమండలి అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగు నీరు రోడ్డంతా నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుర్వాసనతో పాటు దోమలు పెరిగి పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించి రోడ్డుపై నిలిచిన మురుగు నీటిని తొలగించాలని స్థానికులు జలమండలి అధికారులను కోరుతున్నారు.జలమండలి అధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు.


