Sunday, October 4, 2026
Google search engine
Homeతెలంగాణతెలంగాణ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉద్యోగుల రాష్ట్రస్థాయి సమావేశం జయప్రదం – నూతన కార్యవర్గం ఎన్నిక

తెలంగాణ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉద్యోగుల రాష్ట్రస్థాయి సమావేశం జయప్రదం – నూతన కార్యవర్గం ఎన్నిక

ఆరోగ్యశ్రీ ఉద్యోగుల హక్కుల సాధనే ధ్యేయంగా పోరాటాలు ఉధృతం: గిరి యాదయ్య పునరుద్ఘాట

భారత శక్తి

రాష్ట్రంలోని పేద ప్రజలకు వైద్య సేవలందిస్తున్న రాజీవ్ ఆరోగ్యశ్రీ సిబ్బంది సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, ఆరోగ్యశ్రీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశం రాజధాని నగరంలో అత్యంత వైభవంగా మరియు విజయవంతంగా నిర్వహించబడింది. ముప్పై మూడు జిల్లాల నుండి విచ్చేసిన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొని, ఉద్యోగ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ మహాసభకు సెంట్రల్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్ ముఖ్య అతిథిగా విచ్చేసి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కార్మిక లోకానికి ఆయన విప్లవ శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రభుత్వ రంగ సంస్థల్లో మరియు ట్రస్టుల పరిధిలో శ్రమిస్తున్న కార్మికుల సంక్షేమం కోసం ఐక్య పోరాటాల ప్రాముఖ్యతను వివరించారు.

*ఏకగ్రీవంగా నూతన రాష్ట్ర కమిటీ ఎన్నిక:
సమావేశం ముగింపులో సర్వసమ్మతితో ఆరోగ్యశ్రీ ఎంప్లాయిస్ యూనియన్ నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది.

  • రాష్ట్ర అధ్యక్షులు: గిరి యాదయ్య (మరోసారి ఏకగ్రీవ ఎన్నిక)
  • అసోసియేట్ రాష్ట్ర అధ్యక్షులు: సుమన్
  • వర్కింగ్ ప్రెసిడెంట్: విష్ణు
  • రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు: రాజు, కుమార్
  • రాష్ట్ర కోశాధికారి: రత్నం
  • ఉపాధ్యక్షులు: కిషోర్, రవీందర్, సురేష్, సంపత్, లిల్లి పుష్ప
  • రాష్ట్ర సహాయ కార్యదర్శులు: గోలి నాగరాజు, జయరాం
  • ఆర్గనైజింగ్ సెక్రటరీ: రమేష్
  • రాష్ట్ర కమిటీ సభ్యులు: రమణ, శ్రీశైలం తదితరులు

పేద ప్రజలకు సేవ చేస్తున్న మా బతుకులు బాగుపడాలి: రాష్ట్ర అధ్యక్షులు గిరి యాదయ్య:
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులుగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన గిరి యాదయ్య ప్రసంగిస్తూ, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ పరిధిలో అంకితభావంతో పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమం కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

“అశేష పేద ప్రజలకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అహర్నిశలు సేవలు అందిస్తున్న ఆరోగ్యశ్రీ సిబ్బందిని ప్రభుత్వం వెంటనే గుర్తించాలి. మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు ఎలాంటి పరిస్థితులలోనూ వెనుకడుగు వేసేది లేదు. ప్రభుత్వం స్పందించి తక్షణమే మా సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలి” అని ఆయన గట్టిగా విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments