అక్టోబర్ 31 వరకు ఎంట్రీలకు గడువు.. విజేతలకు రూ.38 వేల నగదు బహుమతులు
శేరిలింగంపల్లి : వరి సాగులో రైతుల కష్టాన్ని, వ్యవసాయ ప్రక్రియలను విద్యార్థులకు పరిచయం చేసే లక్ష్యంతో వజ్రతేజ రైస్ క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ‘ది జర్నీ ఆఫ్ ఎ గ్రెయిన్’ రాష్ట్రవ్యాప్త కళా ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ‘బీజమ్’ బియ్యం బ్రాండ్ ప్రారంభానికి ముందు చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి చదివే విద్యార్థులు పాల్గొనవచ్చు.
విద్యార్థులు రైతులు లేదా వ్యవసాయ అనుభవం ఉన్న పెద్దలతో మాట్లాడి, వరి సాగులోని ఏదైనా ఒక దశను ఏ3 సైజు తెల్ల కాగితంపై చేతితో చిత్రించి సమర్పించాలి. అక్టోబర్ 31 చివరి తేదీ కాగా, పోటీలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి వరుసగా రూ.20 వేలు, రూ.10 వేలు, రూ.8 వేల నగదు బహుమతులు అందజేస్తారు. ఎంపికైన ఉత్తమ 100 చిత్రాలను నవంబర్లో హైదరాబాద్లో జరిగే బీజమ్ బ్రాండ్ ప్రారంభోత్సవంలో ప్రదర్శించనున్నారు. ఆసక్తి గల విద్యార్థులు registration.beejam.co.in వెబ్సైట్లో ఉచితంగా నమోదు చేసుకోవచ్చని సంస్థ ప్రతినిధులు తెలిపారు.



