Thursday, July 10, 2025
Google search engine
Homeతెలంగాణఎన్.ఆర్.ఎస్.సి. ఇమేజీల‌ను ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌..

ఎన్.ఆర్.ఎస్.సి. ఇమేజీల‌ను ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌..

లేక్ ప్రొటెక్ష‌న్ క‌మిటీలో భాగ‌స్వామ్యం కావాలంటూ పిలుపు..
:
బాలాన‌గ‌ర్‌లోని నేష‌న‌ల్ రిమోట్ సెన్సింగ్ సెంట‌ర్‌ కార్యాలయాన్ని సందర్శించారు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌.. ఎన్.ఆర్.ఎస్.సి. డైరెక్ట‌ర్ ప్ర‌కాష్ చౌహాన్, డిప్యూటీ డైరెక్ట‌ర్ శ్రీ‌నివాస్ లతో స‌మావేశ‌మై.. ద‌శాబ్దాల నాటి శాటిలైట్ ఇమేజీల‌ను పరిశీలించారు.. చెరువుల ఎఫ్‌టీఎల్ నిర్ధార‌ణ‌తో పాటు.. ప్ర‌భుత్వ స్థ‌లాల ప‌రిర‌క్ష‌ణ‌కు ఎన్ ఆర్ ఎస్ సి శాటిలైట్ ఇమేజీలు ప్ర‌ధాన పాత్ర పోషిస్తాయ‌ని చెప్పిన క‌మిష‌న‌ర్‌. చెరువులు, పార్కులు, ప్ర‌భుత్వ స్థ‌లాలను గుర్తించ‌డ‌మే కాకుండా.. లోత‌ట్టు ప్రాంతాల‌ను, వ‌ర‌ద ముప్పు ఉన్న ప్రాంతాల‌ను గుర్తించేందుకు కూడా ఈ ఇమేజీలు ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయని అభిప్రాయపడ్డారు..

వ‌ర‌ద‌లు వ‌చ్చిన‌ప్ప‌డు ఏ ప్రాంతాలు నీట మునిగాయి.. వ‌ర‌ద కాలువ‌ల ఉధృతి, చెరువుల పూర్తి స్థాయి నీటి నిలువ సామ‌ర్థ్యం ఇలా అన్ని కోణాల్లో అంచ‌నా వేసి.. భ‌విష్య‌త్తులో వ‌ర‌ద ముప్పు లేకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోడానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌కు ఈ ఇమేజీల ప‌రిశీల‌న‌ చేశారు.. ఇప్ప‌టికే స‌ర్వే ఆఫ్ ఇండియా, స‌ర్వే ఆఫ్ తెలంగాణ, గ్రామీణ మ్యాప్‌ల‌ నుంచి స‌మాచారాన్ని సేక‌రించిన హైడ్రాకు.. ఎన్.ఆర్.ఎస్.సి. వ‌ద్ద ఉన్న హై రిజ‌ల్యూష‌న్ శాటిలైట్ ఇమేజీల ద్వ‌రా మ‌రింత స్ప‌ష్ట‌మైన స‌మాచారం తెలుస్తుంది అన్నారు క‌మిష‌న‌ర్‌.

ఎన్.ఆర్.ఎస్.సి. శాటిలైట్ ఇమేజీలు ద్వ‌రా చెరువులు, ప్ర‌భుత్వ స్థ‌లాలు, పార్కులు, ర‌హ‌దారులు, నాలాల ఆక్ర‌మ‌ణ‌లపై క‌చ్చిత‌మైన స‌మాచారాన్ని సేక‌రించేందుకు హైడ్రా చ‌ర్య‌లు చేపట్టనుంది.. చెరువుల ప‌రిర‌క్ష‌ణ‌లో ఎన్.ఆర్.ఎస్.సి. కూడా భాగ‌స్వామ్యం కావాల‌ని రంగనాథ్ కోరారు.. దీనికి ఎన్.ఆర్.ఎస్.ఏ. డైరెక్ట‌ర్‌ అంగీకరించారు.. 1973 నుంచి 2024 వ‌ర‌కూ ఎక్కువ వ‌ర్ష‌పాతం న‌మోదైన డేటా ఆధారంగా అప్ప‌టి శాటిలైట్ ఇమేజీల ద్వారా చెరువుల ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్ జోన్ల‌ను గుర్తించేందుకు హైడ్రా చ‌ర్య‌లు తీసుకుంటోంది..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments