Wednesday, November 25, 2026
Google search engine
Homeతెలంగాణఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగాధర్ , కృష్ణ గౌడ్ గార్లకు...

ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగాధర్ , కృష్ణ గౌడ్ గార్లకు అభినందనలు…

  • పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ,ప్రజల సమస్యలపై దృష్టి పెట్టి ,పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలి….
  • బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్…

శేరిలింగంపల్లి :
రంగారెడ్డి అర్బన్ జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు , కార్యవర్గ సభ్యులు గా నియమితులైన గంగాధర్, కృష్ణ గౌడ్లు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జ్ యం. రవికుమార్ యాదవ్‌ని వారి కార్యాలయంలో కలిసి మర్యాద పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సిద్ధాంతాలను, కేంద్ర ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్తూ పార్టీ బలోపేతమే ధ్యేయంగా కృషి చేయాలని రవి కుమార్ యాదవ్ పిలుపినిచారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన గంగాధర్ , కృష్ణ గౌడ్ లకు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం, గుర్తింపు లభిస్తాయనడానికి వీరి నియామకాలే నిదర్శనమన్నారు. బీసీల హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం ప్రజల్లో ఉంటూ పార్టీని మరింత పటిష్టం చేయాలని సూచించారు.తమపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తూ, శేరిలింగంపల్లి నియోజకవర్గంతో పాటు రంగారెడ్డి అర్బన్ జిల్లా వ్యాప్తంగా బీజేపీ విజయానికి సైనికుల్లా పనిచేస్తామని నూతన నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రాధాకృష్ణ యాదవ్, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు సీతారామ రాజు, డివిజన్ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, కౌన్సిల్ సభ్యులు గణేష్ ముదిరాజ్, అజయ్, మణి, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments