ఎల్బీనగర్:
చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని జోయా లూకాస్ షోరూం ఎదురుగా తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు.ఆటో మెట్రో పిల్లర్ కు ఢీ కొని, రాంగ్ రూట్ లో వస్తున్న టిప్పర్ వాహనానికి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో జయరాజు యాదవ్ (60) అక్కడికక్కడే మృతి చెందారు. ఆటో డ్రైవర్ పోచయ్యకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని చనిపోయిన వ్యక్తి కుమారుడికి ప్రమాదపు వివరాలు తెలిపి అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


