- టీడబ్ల్యూజేఎఫ్ పటాన్చెరువు నూతన అధ్యక్షులు బాదిని శ్రీనివాస్
పటాన్‌చెరు:
జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణే తమ ప్రధాన ధ్యేయమని, నియోజకవర్గ పరిధిలోని ప్రతి జర్నలిస్టుకు అండగా నిలుస్తూ వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) పటాన్‌చెరు నియోజకవర్గ నూతన అధ్యక్షులు బాదిని శ్రీనివాస్ తెలిపారు.
గురువారం పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఐబీ భవనంలో నిర్వహించిన టీడబ్ల్యూజేఎఫ్ 3వ మహాసభల్లో నూతన కమిటీకి అధ్యక్షులుగా ఎన్నికైన అనంతరం ఆయన మాట్లాడారు. జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన ప్రతి అంశంపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అందేలా సంఘం తరఫున కృషి చేస్తామని పేర్కొన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతామని, వారి కష్టసుఖాల్లో టీడబ్ల్యూజేఎఫ్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. జర్నలిస్టుల మధ్య ఐక్యతను మరింత బలోపేతం చేసి, వృత్తి గౌరవాన్ని కాపాడేందుకు అందరి సహకారంతో ముందుకు సాగుతామని తెలిపారు.
సంఘ బలోపేతంతో పాటు జర్నలిస్టుల హక్కుల సాధన, సంక్షేమ పథకాల అమలు కోసం సమిష్టిగా పనిచేస్తామని, ప్రతి జర్నలిస్టుకు అందుబాటులో ఉండే నాయకత్వాన్ని అందిస్తామని బాదిని శ్రీనివాస్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.


