- రోడ్ల మరమ్మతులు, డ్రైనేజీ పైపులైన్ల విస్తరణకు ఆదేశాలు..
- కమ్యూనిటీ హాల్, చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటుకు వినతి
ఎల్బీనగర్:
మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని డాక్టర్స్ కాలనీ డివిజన్ జింకల బావి కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి చొరవ చూపారు. జేబీ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానికంగా పర్యటించిన ఎమ్మెల్యే కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కాలనీలోని 1 వ నంబర్ 3/ఏ దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేయాలని, మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా డ్రైనేజీ పైపులైన్ల సామర్థ్యాన్ని పెంచాలని, తాగు నీరు సమస్యలు కూడా లేకుండా చూడాలని కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అలాగే కాలనీవాసుల అవసరాల కోసం కమ్యూనిటీ హాల్ నిర్మించాలని, చిన్నారులు ఆడుకునేందుకు చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేయాలని కోరారు. స్థానికులు వివరించిన సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, అక్కడే ఉన్న ఎంఎంసీ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు మెరుగైన వసతులు అందించాలని అధికారులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో సరూర్ నగర్ డిప్యూటీ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్, జల మండలి డిజిఎం చంద్రు నాయక్, ఇంజనీరింగ్ సెక్షన్ డిఈ విజయ్ కుమార్, శానిటేషన్ డిఈ చందన, ఇంజనీరింగ్ సెక్షన్ ఏఈ ప్రశాంతి, ఎస్ఎస్ఏ బుచ్చయ్య, బీఆర్ఎస్ స్థానిక నాయకులు లోకసాని కొండల్ రెడ్డి, అంకిరెడ్డి, రాగం సునీల్, సందీప్ ఋషి, ప్రత్యూష్, గుఫ్రాన్, జేబి కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు రవీందర్ రెడ్డి, మాధవ రెడ్డి, వెంకటేశ్వర్లు, సైదులు స్థానికులు పాల్గొన్నారు.



