100 మందికి 5 గ్రాముల చొప్పున 24 క్యారెట్ల బంగారం గెలుచుకునే అవకాశం
ఎల్బీనగర్
ఆభరణాల ప్రియులకు శుభవార్త. ప్రముఖ ఆభరణాల సంస్థ వేగా జ్యువెలర్స్ దిల్సుఖ్ నగర్లో నూతన షోరూమ్‌ను ఘనంగా ప్రారంభించింది. ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ శుభాశీస్సులతో ప్రముఖ సినీనటి ప్రగ్యా జైస్వాల్ చేతుల మీదుగా షోరూమ్ ప్రారంభోత్సవం జరిగింది.ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ బండ్లమూడి రామ్మోహన్, మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ వనమా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుధాకర్ వనమా పాల్గొన్నారు.ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇది తమ ఏడో షోరూమ్ కాగా, హైదరాబాద్ నగరంలో రెండో షోరూమ్ అని తెలిపారు. ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. బంగారు ఆభరణాలపై 2.99 శాతం నుంచి 11.99 శాతం వరకు మేకింగ్ ఛార్జీలు, ప్రత్యేక ధరలతో ఆభరణాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రత్యేక ఆఫర్లు నవంబర్ 6 నుంచి 30వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
మరో ప్రత్యేక ఆకర్షణగా మెగా గోల్డ్ లక్కీ డ్రా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మొత్తం 100 మంది విజేతలకు ఒక్కొక్కరికి 5 గ్రాముల చొప్పున 24 క్యారెట్ల బంగారం అందించనున్నట్లు తెలిపారు. మొత్తం 500 గ్రాముల బంగారాన్ని విజేతలకు బహుమతిగా ఇవ్వనున్నట్లు వివరించారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా సరికొత్త డిజైన్లతో బంగారు, వజ్రాభరణాలు, సంప్రదాయ, ఆధునిక ఆభరణాల విభిన్న కలెక్షన్లను అందుబాటులో ఉంచినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. వివాహాలు, శుభకార్యాలు, పండుగలు, ప్రత్యేక సందర్భాలకు అనువైన ఆభరణాలు ఒకే చోట లభిస్తాయని వారు పేర్కొన్నారు.



