*దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రముఖులు.. సంతాపం తెలిపిన నాయకులు
ఎల్బీనగర్:
కందుకూరు మండలం పులిమామిడి గ్రామ మాజీ సర్పంచ్ అనేగౌని అంజయ్య గౌడ్ ఆకస్మిక మరణం పట్ల రాజకీయ, సామాజిక వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. గుండెపోటుతో సోమవారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు.
ఈ విషయమై సమాచారం అందుకున్న టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ వెంటనే పులిమామిడి గ్రామానికి తరలివెళ్లారు. అంజయ్య గౌడ్ భౌతికకాయంపై పూలమాలలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ధైర్యం చెప్పారు.
*ఘన నివాళులర్పించిన ప్రముఖులు
అంజయ్య గౌడ్ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించిన ప్రముఖులలో:
- మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి
- మాజీ జడ్పీ Chairperson తీగల అనిత రెడ్డి
- మాజీ ZPTC సభ్యులు ఏనుగు జంగారెడ్డి, నోముల కృష్ణ గౌడ్
- కందుకూరు సర్పంచ్ సరికొండ పాండు
- బైరామల్‌గూడ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
*పాల్గొన్న ఇతర నాయకులు
ఈ అంతిమ నివాళుల కార్యక్రెమంలో జిల్లా అధికార ప్రతినిధి దాము మహేందర్ యాదవ్, సరికొండ మల్లేష్, దిండు ప్రవీణ్ గౌడ్, సతీష్, నరసింహ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని అంజయ్య గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.



