ఎల్బీనగర్:
పోలీస్ నియామకాల ప్రిలిమినరీ పరీక్షలలో ఈడబ్ల్యూఎస్ వర్గాలకు సంబంధించిన కటాఫ్ మార్కులను తగ్గించాలని, అలాగే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నియామక ప్రక్రియలో న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రెడ్డి సంఘం నాయకులు ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డిని కలిసి సమస్యను వివరించి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ రెడ్డి సంఘం అధ్యక్షులు బద్దూరి వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సంఘ నాయకులు పాల్గొని, అభ్యర్థుల సమస్యలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు సమాన అవకాశాలు – పారదర్శక నియామక ప్రక్రియే మా లక్ష్యం.


