ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రాంచందర్..
వర్షాల కారణంగా లక్షాన్ని చేరలేకపోయామని వెల్లడి..
మణుగూరు ఏరియా అక్టోబర్ నెలలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 10 లక్షల 36 వేల 500 టన్నులకు గాను 7 లక్షల 52 వేల484 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేశామని ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రాంచందర్ అన్నారు. వర్షాల కారణంగా లక్ష్యాన్ని చేధించలేక పొయ్యామని 73శాతం మాత్రమే సాధించామని జియం తెలిపారు. శుక్రవారం జియం కార్యాలయంలోని సమావేశ మందిరంలో విలేకరులతో నెలవారి బొగ్గు ఉత్పత్తి ఉత్పాదక గురించి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 01 ఏప్రిల్, నుండి 31 అక్టోబర్ వరకు ప్రోగ్రెస్సివ్ బొగ్గు ఉత్పత్తి 62 లక్షల 11 వేల టన్నుల లక్ష్యానికి గాను 59 లక్షల31 వేల 117 టన్నులు 95 శాతం సాధించడం జరిగిందన్నారు. అక్టోబర్ నెలలో 6 లక్షల 74 వేల 84 టన్నుల బొగ్గును రవాణా చేయటం జరిగిందన్నారు. 01ఏప్రిల్, నుండి 31 అక్టోబర్ వరకు ప్రోగ్రెస్సివ్ గా 58 లక్షల 39 వేల 525 టన్నులు రవాణా చేశామన్నారు. అక్టోబర్ నెలలో ఓవర్ బర్డెన్ డిపార్ట్ మెంటల్ గా 15 లక్షల క్యూబిక్ మీటర్లకు లక్ష్యానికి గాను 64 శాతంతో 9 లక్షల 54 వేల క్యూబిక్ మీటర్లు తీయటం జరిగిందన్నారు. సింగరేణి కాలరీస్ సిఎండి బలరాం, స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు సింగరేణి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నవంబర్ 9న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రవేట్ కంపెనీల భాగస్వామ్యం తో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా ను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఏరియా జియం కోరారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఓ టు జిఎం బి. శ్రీనివాస చారి, ఏరియా ఇంజినీర్ ఆర్. శ్రీనివాస్, ఏరియా రక్షణ అధికారి వెంకట రామరావు, ప్రాజెక్టు అధికారి మణుగూరు ఓసి ఈ. శ్రీనివాస్, ఏజిఎం (ఐఈడి)సిహెచ్ రాంబాబు, జిఎం (పర్సనల్)ఎస్. రమేశ్, డిజిఎం ( ఫైనాన్స్) ఎం. అనురాధా, డివై.సిఎంఓ జ్యోతిర్మై , పర్యావరణ అధికారి జీ.శ్రీనివాస రావు, ఏరియా సెక్యూరిటీ అధికారి కే. శ్రీనివాస్, డివై.ఎస్ఈ డివిఎస్ఎన్ ప్రవీణ్, సీనియర్ పర్సనల్ అధికారి సింగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


