ఎల్బీనగర్:
గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని మధురాపురి కాలనీలో స్ట్రామ్ వాటర్ నాలా కనెక్టివిటీ లేకపోవడంతో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోయి స్థానిక వీధి వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం స్థానిక వ్యాపారులు మాజీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.దీంతో బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మంగళవారం సరూర్నగర్ సర్కిల్ ఈఈ కార్తీక్, డివిజన్ ఏఈ సాయి, వర్క్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావుతో కలిసి మధురాపురి కాలనీలో పర్యటించి, స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యను ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంగా బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడం వల్ల స్థానిక ప్రజలు, వీధి వ్యాపారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఇంజనీరింగ్ సెక్షన్ ఈఈ కార్తీక్ దృష్టికి తీసుకెళ్లారు.ముఖ్యంగా స్ట్రామ్ వాటర్ నాలా కనెక్టివిటీ పనులకు సంబంధించి వెంటనే ఎస్టిమేట్ సిద్ధం చేసి, నిధుల మంజూరు ప్రక్రియను పూర్తి చేసి, వీలైనంత త్వరగా పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని కోరారు.
దీనిపై ఇంజనీరింగ్ సెక్షన్ ఈఈ కార్తీక్ సానుకూలంగా స్పందిస్తూ, వెంటనే ఎస్టిమేట్ సిద్ధం చేయాలని ఏఈ సాయిని ఆదేశించారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గౌతమ్ నగర్ కాలనీ అధ్యక్షులు కళ్లెం మధుసూదన్ రెడ్డి, శాంతినగర్ కాలనీ చిన్న, మధురాపురి కాలనీ ట్రేడ్ మర్చంట్ అసోసియేషన్ సభ్యులు వెంకటేష్ కురుమ, కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు సునీల్ బాబు, శారదానగర్ కాలనీ వాసులు మహేష్, డింపు, బీజేపీ నాయకులు మరియు స్థానికులు పాల్గొన్నారు.


