- జిల్లాలో పనిచేస్తున్న 28 శాఖలకు సంబంధించిన 67 అంశాలపై చర్చ..
రంగా రెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సామాజిక, మానవ వనరుల అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు కోసం, జిల్లా అభివృద్ధి కోఆర్డినేషన్, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశంలో పాల్గొన్నారు టిపిసిసి ప్రధాన కార్యదర్శి, మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి.. ఈ సమావేశంలో జిల్లాలో పనిచేస్తున్న 28 శాఖలకు సంబంధించిన 67 అంశాలపై చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ… మల్లాపూర్ లోని పేదల కోసం నిర్మించిన ఇళ్లను మధ్యలోనే నిలిపివేయడం జరిగిందని వాటికోసం నిధులు కేటాయించి నిర్మాణం పూర్తి చేసి పేదలకు అందజేయాలని కోరారు. అలాగే మరొక మూడు అంగన్ వాడి కేంద్రాలను మంజూరు చేయాలని కోరారు. ఈ సమావేశంలో చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, అదనపు కలెక్టర్ లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు..