పలు కాలనీలలో నూతనంగా చేపట్టబోయే పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన…..పిఎసి చైర్మన్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
శేరిలింగంపల్లి :
మాదాపూర్ డివిజన్ పరిధిలోని అరుణోదయ కాలనీ,అయ్యప్ప సొసైటీ, గోకుల్ ప్లాట్స్, ఆదిత్య నగర్, మాతృ శ్రీ నగర్,సిద్ధి వినాయక నగర్,గుట్టల బేగం పేట్,సర్వే ఆఫ్ ఇండియా, సైబర్ హిల్స్ కాలనీలలో రూ. 9 కోట్ల 14 లక్షల 35 వేల రూపాయల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు, వరద నీటి కాల్వ నిర్మాణం పనులకు , స్మశాన వాటిక అభివృద్ది మరియు సుందరీకరణ పనులకు ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన పి ఎ సి చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
ఈ సందర్భంగా పిఎసి చైర్మన్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం మరియు శేరిలింగంపల్లి నియోజకవర్గం, కాలనీల అభివృద్దే ధ్యేయంగా ప్రజల సౌకర్యార్థం మాదాపూర్ డివిజన్ పరిధిలోని రూ. 9 కోట్ల 14 లక్షల 35 వేల రూపాయల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు, వరద నీటి కాల్వ నిర్మాణం పనులకు , స్మశాన వాటిక అభివృద్ది మరియు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగినది అని, సీసీ రోడ్లతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, కాలనీల వాసులకు నేటితో ఉపశమనం లభించింది అని తెలిపారు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకంలో మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో శేరిలింగంపల్లి నియోజకవర్గం ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని , శేరిలింగంపల్లి నియోజకవర్గం ను అగ్రభాగాన నిలబెడుతామని తెలిపారు.
సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకం లో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన ,అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితానని తెలియచేసారు. అదేవిధంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ,నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని ప్రజలకు ట్రాఫిక్ రహిత ,సుఖవంతమైన ,మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని,అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని అదేవిధంగా వరద నీటి కాల్వ నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, వర్షపు నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడాలని అధికారులకు చెప్పడం జరిగినది. పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించడం జరిగినది , ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిపిస్తామని ,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని చెప్పడం జరిగినది.
అదేవిధంగా గుట్టల బేగం పేట్ స్మశాన వాటిక ను అన్ని హంగులతో సకల సౌకర్యాలతో అభివృధి చేస్తామని, స్మశాన వాటిక చుట్టూ ప్రహరీ గోడ , దహన వాటిక, స్నానపు గదులు, శివుడు విగ్రహం, పూజ మండపం, స్టోర్ రూమ్ లు, విశ్రాంతి గదులు, టాయిలెట్ గదులు, వర్షపు ఇంకుడు గుంత ను నిర్మించడం జరుగుతుంది అని , పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదు అని ,పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తెలియచేశారు. చక్కటి ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తామని తెలియచేశారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ,అన్నివేళలో ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ,మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని, మాదాపూర్ డివిజన్ మరియు శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమం కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.



