Home తెలంగాణ రెవెన్యూ సదస్సులో పాల్గొన్న కప్పాటి పాండురంగా రెడ్డి..

రెవెన్యూ సదస్సులో పాల్గొన్న కప్పాటి పాండురంగా రెడ్డి..

0
రెవెన్యూ సదస్సులో పాల్గొన్న కప్పాటి పాండురంగా రెడ్డి..
The revenue conference to be held from today to the 20th..

నేటి నుంచి 20 తారీఖు వరకు జరుగనున్న రెవెన్యూ సదస్సు..
బాచుపల్లి, దెబ్బడ గూడ రెవెన్యూ డివిజన్లలో నిర్వహణ..

నూతన రెవెన్యూ చట్టం.. భూభారతి అమలులో భాగంగా మంగళవారం నుంచి ఈ నెల 20 తారీఖు వరకు నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో భాగంగా.. బాచుపల్లి, దెబ్బడ గూడలో కందుకూరు రెవెన్యూ డివిజన్ అధికారి జగదీశ్వర్ రెడ్డి, కందుకూరు మండల తహసీల్దారు గోపాల్ తో యం.యం.సి. ఛైర్మన్, మాజీ జడ్పిటీసిలు ఏనుగు జంగారెడ్డి, బొక్క జంగారెడ్డి, అందుగుల సత్యనారాయణతో పాటు కలసి రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ కప్పాటి పాండురంగా రెడ్డి పాల్గొన్నారు.. అనంతరం ఆయన మాట్లాడుతూ..

బీ.ఆర్.ఎస్. పాలనలో భూకబ్జాలు వంటివి పెరిగి భూ సమస్యలతో రైతులు అవస్థలు పడ్డారని వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని బిఆర్ఎస్ ప్రభుత్వం తీసికువచ్చిన ధరణి కారణంగా చాలా విషయాల్లో భూసమస్యలు అధికమై భూవివాదాలతో కొట్టుకుని చావాల్సిన పరిస్థితులేర్పడ్డాయి. ధరణిలో తలెత్తిన సమస్యలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన ప్రభుత్వం సమస్యలు లేకుండా రికార్డులన్నీ సరళతరం చేసే లక్ష్యంతో ధరణి పోర్టల్ లో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు, ధరణీ స్థానంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి పోర్టల్‌ను తీసుకొచ్చింది అని తెలిపారు.. తీసుకొచ్చిన భూభారతి ద్వారా భూముల పాలనను మరింత పారదర్శకత కోసం
భూసమస్యల శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని.. అందులో భాగంగా రెవెన్యూ సదస్సుల ద్వారా రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది అని తెలిపారు..

ఈ కార్యక్రమంలో మాజీ కోఆప్షెన్ సభ్యులు మహమ్మద్ అహమ్మద్, జానీ, రాణా ప్రతాప్ రెడ్డి, సి ఎచ్. కృష్ణ, మాజీ ఎంపిటిసి సరికొండ పాండు, ఎకుల మహేందర్, సయ్యద్ అజీజ్, యమ్.యమ్.సి. సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి, డిల్లీ శ్రీధర్, బుక్క పాండురంగా రెడ్డి,
డిప్యూటీ తహసీల్దారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, గ్రామ కార్యదర్శులు, రెవెన్యూ సిబ్బంది,
ఇందిరమ్మ కమిటి సభ్యలు మలగల విజయ్, యుగంధర్ రెడ్డి, కత్తుల రాజశేఖర్, మండల ఎస్సి సెల్ అధ్యక్షుడు కత్తుల వెంకటేష్, మాజీ సర్పంచ్ లు ఆరోగ్య రెడ్డి, యాలల శ్రీనివాస్, మద్దెల రాములు, మజీ ఎంపిటి సభ్యుడు గుండాల సురేష్, పార్టీ నాయకులు శంకరయ్య యాదవ్, మద్దెల శ్రీశైలం, మంఖాల రాజు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here