తెలుగు బిగ్ బాస్ పై వెల్లువెత్తుతున్న విమర్శలు..
యువతను పెడచెవిన పెడుతుందంటూ ఆగ్రహ జ్వాలలు..
రేటింగ్ కోసం ఎంతకైనా తెగిస్తారా అంటున్న మేధావులు..
బహిరంగ వ్యభిచారం అంటూ సీపీఐ నారాయణ ఆగ్రహం..
వెంటనే బ్యాన్ చేసి నిర్వాహకులను శిక్షించాలంటూ డిమాండ్స్..
వినోదం కోసమో విజ్ఞానం కోసమో ఒక టీవీ ప్రోగ్రామ్ చూస్తాం.. కానీ ఇలాంటి ప్రోగ్రాం మనకు ఏమిస్తుందో అర్ధం కాకుండా ఉంది.. ఈ ప్రోగ్రాం చూసి, గొడవపడాలా..? కక్షలు పెంచుకోవాలా..? మోసం చేయడం నేర్చుకోవాలా..? స్వార్ధపూరిత మనస్తత్వం అలవర్చుకోవాలా..? లేక అక్రమ సంబంధాలు పెట్టుకోవాలా..? పెళ్ళైనా సరే వేరే మొగవాడితో స్నేహం చేయాలా..? ఏమిటీ దౌర్భాగ్యం.. ఇలాంటి కోవలోకే వస్తుంది తెలుగు బిగ్ బాస్ షో.. యువసామ్రాట్ అక్కినేని నాగార్జున ప్రస్తుత సీజన్ ప్రోగ్రాంను హోస్ట్ చేస్తున్నాడు.. బిగ్ బాస్ అన్ని భాషల్లోనూ ప్రసారం అవుతోంది.. ఆయా భాషలకు సంబంధించిన ప్రముఖ ఆర్టిస్టులు ఆ షోని హోస్ట్ చేస్తున్నారు.. బాగానే వుంది.. మంచి రేటింగ్ తో కార్యక్రమం సాగుతోంది.. నిర్వాహకులకు దండిగానే పైకం వస్తోంది.. కానీ ఆ షోలో చేస్తున్న వెకిలి చేష్టలు ఏమిటి..? విరక్తి కలిగించే వల్గర్ ప్రవర్తనలు, బూతులు ఏమిటి..? సమాజానికి ఏమి అందించడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు..? ఇప్పటికే కన్నడ భాషలో ఈ కార్యక్రమాన్ని నిలిపివేశారు.. అక్కడి ప్రజలు కాస్త విజ్ఞులు కాబట్టి మేలుకున్నారు.. తమ పిల్లల భవిష్యత్తును కాపాడాలి అనుకున్నారు.. అయితే తెలుగులో పరిస్థితి ఏమీ మారలేదు.. సీపీఐ నారాయణ లాంటి మేధావి సైతం బిగ్ బాస్ అనే ప్రోగ్రాం బహిరంగ వ్యభిచారం.. దీన్ని బ్యాన్ చేయాలి.. హోస్ట్ నాగార్జునను, నిర్వాహకులను కఠినంగా శిక్షించాలి.. అని డిమాండ్ చేస్తున్నారంటే ఈ కార్యక్రమం ఎంత దరిద్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.. ఎంత అభ్యంతరకరంగా ఉందో కూడా అర్ధం చేసుకోవచ్చు..
తెలుగు టెలివిజన్ ప్రపంచంలో అత్యధిక చర్చలకు దారి తీసిన షో బిగ్ బాస్ అనేది వాస్తవం.. నగ్న సత్యాలు, నాటకీయ ఘర్షణలు, వ్యక్తిగత జీవితం ప్రదర్శనలు.. ఇవన్నీ ఈ షో ప్రత్యేకతలు. కానీ ప్రజలలో, రాజకీయ వర్గాల్లో, సాంస్కృతిక వర్గాల్లో ఇది తీవ్ర విమర్శలకు గురవుతోంది. రోజువారీ ఒత్తిడికి ఉపశమనంగా బిగ్ బాస్‌ని చూసే వారు లక్షలాదిమంది ఉన్నారు.. అయితే ఇది “మనుషుల మానసిక స్వభావాన్ని తెలుసుకునే ప్రయోగం” అంటారు కొంతమంది.. అయితే అదే సమయంలో, ఇందులోని అసభ్యత, వ్యర్థ ఘర్షణలు, నైతిక పతనం సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని పెద్దలు, విద్యావేత్తలు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.
ఇటీవల సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ చేసిన వ్యాఖ్యలు ఎంతో చర్చనీయాంశమయ్యాయి. “బిగ్ బాస్ షోలో అసభ్య ప్రదర్శనలు, ఓపెన్ వ్యభిచారం లాంటి విషయాలు జరుగుతున్నాయి. ఇది యువతను చెడగొడుతోంది. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి హోస్ట్ నాగార్జున, మిగతా నిర్వాహకులకు కఠిన శిక్షలు విధించాలి అని ఆయన డిమాండ్ చేశారు.. ఈ షో సాంస్కృతిక విలువలను బలహీనపరుస్తూ, ప్రజాస్వామ్య సమాజంలో అసహనాన్ని పెంచుతోంది అన్నారు.. ఈ షోకి హోస్ట్‌గా ఉన్న నటుడు అక్కినేని నాగార్జునపై కూడా విమర్శల వర్షం కురుస్తోంది. సాంప్రదాయ విలువలతో ప్రసిద్ధి చెందిన నటుడు ఇలా “అసభ్య కంటెంట్‌కి ముఖచిత్రం”గా నిలుస్తున్నారని కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన అభిమానులు మాత్రం “హోస్ట్ మాత్రమే, కంటెంట్‌పై పూర్తి నియంత్రణ ఆయనకు లేదు” అని సమర్థిస్తున్నారు. కంటెంట్ నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు.. రియాలిటీ షోలపై మానిటరింగ్ కమిటీ ఉండాలి. అసభ్య కంటెంట్‌పై జరిమానాలు విధించాలి.. టి.ఆర్.పీ. కోసం సంస్కృతిని నాశనం చేస్తున్న ఛానెల్స్‌పై కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి..


