Home తెలంగాణ *సాగర్ రింగ్ రోడ్ – బి.ఎన్.రెడ్డి ఫ్లైఓవర్ నిర్మాణానికి త్వరలో నిధులు మంజూరు: సుజాత నాయక్

*సాగర్ రింగ్ రోడ్ – బి.ఎన్.రెడ్డి ఫ్లైఓవర్ నిర్మాణానికి త్వరలో నిధులు మంజూరు: సుజాత నాయక్

0
1

*ఎల్బీనగర్:
సాగర్ రింగ్ రోడ్డు నుంచి హస్తినాపురం మీదుగా బి.ఎన్.రెడ్డి వరకు ఫ్లైఓవర్ నిర్మాణానికి త్వరలోనే ప్రత్యేక నిధులు మంజూరు కానున్నట్లు హస్తినాపురం మాజీ కార్పొరేటర్ సుజాత నాయక్ వెల్లడించారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ సహకారంతో ఈ కీలక అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు ఆమె తెలిపారు.

*పెరుగుతున్న రద్దీ… నిత్యం ట్రాఫిక్ కష్టాలు
సాగర్ రింగ్ రోడ్డు నుంచి బి.ఎన్.రెడ్డి మార్గంలో ప్రతిరోజు వేలాదిగా వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో నిత్యం తీవ్ర ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు ఈ రద్దీ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీలు విస్తరిస్తున్న కొద్దీ ఈ ప్రధాన రహదారిపై వాహనాల ఒత్తిడి ఊహించని రీతిలో పెరుగుతోంది. భవిష్యత్తులో ఈ సమస్య మరింత జటిలమయ్యే ప్రమాదం ఉన్నందున, శాశ్వత పరిష్కారంగా ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరినట్లు సుజాత నాయక్ వివరించారు.

*త్వరలోనే పట్టాలెక్కనున్న అభివృద్ధి పనులు
ప్రజల రవాణా ఇబ్బందిని గుర్తించిన ప్రభుత్వం, ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి సానుకూలంగా స్పందించిందని, త్వరలోనే నిధులు కేటాయించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు పూర్తిగా తొలగిపోయి, ప్రయాణం సులభతరం కానుంది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here