ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్..
ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన స్టాళ్ళ సందర్శన..
హమ్ స్టెక్ కాలేజ్ ఆఫ్ క్రియేటివ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రోజు హైటెక్స్ లో నిర్వహించిన హమ్ స్టెక్స్ క్రియేటర్స్ కలెక్ట్ -2025 మెగా ఎగ్జిబిషన్ కార్యక్రమానికి టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన పరిశీలించారు. ఫ్యాషన్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్, ఫోటోగ్రఫీ, ఎడ్యుకేషన్, ఫుడ్ ఐటమ్స్, వివిధ ప్రాచీన, సాంప్రదాయ కళాకృతులు తదితర రకరకాల అంశాలలో ఏర్పాటుచేసిన స్టాళ్లు ఆకట్టుకున్నాయి. 6000 మంది హాజరైన ఈ ఎగ్జిబిషన్లో.. 4000 మంది విద్యార్థులు భాగస్వామ్యం అయ్యారు. ఎగ్జిబిషన్లో ఏర్పాటుచేసిన నిర్వాహకులు అజిత్ , యోగేష్ లను అభినందించారు. ఆకట్టుకునేలా స్టాళ్ళను ఏర్పాటు చేసిన నిర్వాహకులకు ఎక్సలెన్స్ అవార్డులను అందజేశారు.
వినియోగదారులందరిని ఆకర్షించేలా హైదరాబాదులో ఇలాంటి అన్ని రకాల అంశాలతో కూడిన స్టాళ్లను ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. ఈ ఎగ్జిబిషన్ కు అనుసంధానంగా ఏర్పాటు చేసిన స్టాళ్లకు సంబంధించి 14 లక్షలమంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉండడం అభినందనీయమన్నారు.


