ఎల్బీనగర్:
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా హుడా కాంప్లెక్స్ లోని పాంచజన్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపం ముందు తెలంగాణ విమోచన దినోత్సవం కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకులు ఆరుట్ల సురేష్ కుమార్ జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా ఆరుట్ల సురేశ్ మాట్లాడుతూ, 1948 సెప్టెంబర్ 17న సర్దార్ వల్లభభాయ్ పటేల్ నాయకత్వంలో చేపట్టిన ‘ఆపరేషన్ పోలో’ అనంతరం హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనం అయింది. ఈ చారిత్రాత్మక ఘట్టం కోసం పోరాడిన అమరవీరులకు ఘణ నివాళులు అర్పిద్దాం.తెలంగాణ విమోచన స్ఫూర్తితో దేశ సమగ్రత, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, ప్రజల ఆత్మగౌరవం కోసం మనమంతా కలిసి ముందుకు సాగుదామని అన్నారు.బీజేపీ రంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యుడు బెంగారబోయిన సురేష్ ముదిరాజ్ అధ్యక్షన జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సిద్ధు ముదిరాజ్, సాగర్, సూర్యపల్లి శ్రీకాంత్, సుగురప్ప, గజ్జల కృష్ణ , పొన్నం బద్రి , రామారావు, మనోహర్, నవకాంత్ గౌడ్, చంటి, మహిళ నాయకురాళ్ళు వరలక్ష్మి, శారద,సుమలత,అనిత,సరస్వతి రాజకుమారి, శశిధర్ గౌడ్, ప్రేమ్ యాదవ్ శివ తదితరులు పాల్గొన్నారు


