Friday, August 7, 2026
Google search engine
Homeతెలంగాణఇదేందయ్యా ప్రకాష్ గౌడ్? -పేగు బంధాన్ని బలిపెడుతున్న రాజకీయం

ఇదేందయ్యా ప్రకాష్ గౌడ్? -పేగు బంధాన్ని బలిపెడుతున్న రాజకీయం

  • -కన్న కొడుకునే కాదంటున్న వైనం
  • -ప్రేమ వివాహం పేరిట రగులుతున్న వివాదం
  • -సొంత కొడుకుపైనే హత్యా యత్నం ఆరోపణలు?
  • -వాడెవడో నాకొడుకు కాదంటున్న ప్రకాష్ గౌడ్

హైదరాబాద్:

రాజధాని రాజకీయాల్లో నైతిక విలువలు మంటగలుస్తున్నాయి. రక్త సంబంధాలు, కన్న పేగు బంధాలు కూడా రాజకీయ స్వలాభానికి, అహంకారానికి అడుగుల మడుగులవుతున్న దుస్థితి దాపురించింది. రాజేంద్రనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుటుంబంలో చెలరేగిన వివాదం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. తాను ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకున్నడనే ఏకైక కారణంతో.. కన్న కొడుకునే శత్రువుగా భావించి, అంతుచూసేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలు అటు రాజకీయ వర్గాలలో, ఇటు మానవీయ కోణంలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి.

*ప్రేమ జంటపై ప్రతాపం.. కన్నతండ్రి పైనే సంచలన ఆరోపణలు!
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుమారుడు సంతోష్ గౌడ్ చేసిన ఆరోపణలు అక్షరాలా నమ్మశక్యం కాని విధంగా ఉన్నాయి. మణికొండకు చెందిన బీఆర్ఎస్ నాయకురాలు రూపారెడ్డి కుమార్తె శ్రేయాషిని సంతోష్ గౌడ్ గాఢంగా ప్రేమించారు. ఇరు కుటుంబాల అంగీకారంతోనే జూలై 8న వీరిద్దరికీ ఘనంగా నిశ్చితార్థం కూడా పూర్తయింది. స్వయంగా కుటుంబ సభ్యుల సమక్షంలోనే నిశ్చితార్థం చేసుకున్నప్పటికీ, ఆ తర్వాత రాజకీయ సమీకరణాలు, పరువు ప్రతిష్టల అహంకారం ఆ కుటుంబంలో చిచ్చుపెట్టాయి.
తన కొడుకు ప్రేమ వివాహాన్ని జీర్ణించుకోలేకపోయిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, తెరవెనుక వ్యూహం పన్నినట్లు సంతోష్ గౌడ్ ఆరోపిస్తున్నారు. గత నెల రోజులుగా తాను కాబోయే భార్య ఇంటిలోనే ఉంటున్నానని తెలిసి కూడా, అనుచరులతో కలిసి సుమారు 40 మందితో ఆ ఇంటిపై దాడులు చేయించారని కన్నీటిపర్యేతమయ్యారు. ఏ క్షణమైనా తనను, తనను చేరదీసిన ఆ అబల కుటుంబాన్ని అంతం చేయాలని కుట్ర పన్నుతున్నారని, తన ప్రాణాలకు ఏ ముప్పు వాటిల్లినా దానికి పూర్తిగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారే కారణమని సంచలన ప్రకటన చేశారు.

*”వాడెవడో నాకు సంబంధం లేదు”.. నిండు ప్రాణాలను గాలికి వదిలేసిన తండ్రి!
కన్న కొడుకు తన ప్రాణాలకు ముప్పు ఉందని మీడియా ముందు రోదిస్తున్న వేళ, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇచ్చిన స్పందన అత్యంత క్రూరంగా, బాధ్యతారహితంగా ఉంది. కన్న పేగు బంధాన్ని క్షణాల్లో తెంచుకుంటూ.. “వాడెవడో నాకు సంబంధం లేదు.. ఆ విషయం గురించి నేను మాట్లాడదలచుకోలేదు. సమయం వచ్చినప్పుడు మాట్లాడతాను” అంటూ ప్రకాష్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు సమాజంలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
అధికార దర్పం, రాజకీయ పలుకుబడి తలకెక్కిన నాయకులు కన్న కొడుకు జీవితాన్ని, అతని ప్రాణాలను కూడా కేవలం ఓ రాజకీయ రాజీగా, భయానక క్రీడగా మలచడం మానవత్వాన్ని సిగ్గుపడేలా చేస్తోంది. ఒక తండ్రిగా రక్షణ కల్పించాల్సిన స్థానంలో ఉన్న ఎమ్మెల్యేనే స్వయంగా తన రక్తపు చుక్కను దూరం పెట్టడం, కొడుకు కాదంటూ బహిరంగంగానే వదిలించుకోవడం తీవ్రంగా ఖండించదగ్గ పరిణామం.

పోలీస్ వ్యవస్థ అండతో దాడులు? ఆరోపణల వెనుక అసలు నిజాలు!

ఈ వివాదంలో పోలీసుల పాత్ర కూడా అత్యంత వివాదాస్పదంగా మారుతోంది. యువతి ఇంటిపై 40 మందికి పైగా దుండగులు దాడి చేసి బీభత్సం సృష్టించినా, నార్సింగ్ పోలీసులు మాత్రం అధికార పార్టీ ఎమ్మెల్యే ఒత్తిళ్లతో బాధితుల ఫిర్యాదులను బుట్టదాఖలు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. పైగా బాధితులపైనే అక్రమ కేసులు బనాయించేందుకు కుట్ర జరుగుతోందని సంతోష్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • ఒక ప్రజాప్రతినిధి కుటుంబంలోనే మహిళలకు, యువతకు రక్షణ కరువైతే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి?
  • ప్రేమ వివాహం చేసుకున్న యువతీయువకులను హతమార్చడానికి అనుచరులను ప్రయోగించడం ఏ రాజ్యాంగం కిందకు వస్తుంది?
  • సొంత కొడుకే ప్రాణభయంతో మీడియా ముందుకొచ్చి వేడుకుంటున్నా, చట్టం ఎందుకు మౌనంగా ఉంది? సమాజం తలదించుకోవాల్సిన దుస్థితి:
    ఈ ఉదంతం కేవలం ఒక తండ్రి, కొడుకుల మధ్య జరిగిన వ్యక్తిగత గొడవ కాదు. ఇది రాజకీయ అహంకారానికి, మానవతా విలువలకు మధ్య జరుగుతున్న ఘర్షణ. చట్టసభలలో ప్రజల హక్కులను కాపాడాల్సిన ఒక ప్రజాప్రతినిధి, కన్న కొడుకు ప్రాణాలనే బలిపెట్టడానికి సిద్ధపడటం ప్రజాస్వామ్య వ్యవస్థకే తీరని మచ్చ. సంతోష్ గౌడ్ దంపతులకు తక్షణమే ప్రభుత్వపరంగా, న్యాయపరంగా రక్షణ కల్పించకపోతే, ఇది ఒక పెద్ద విషాదానికి దారితీసే ప్రమాదం ఉంది. ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదని, కానీ మానవత్వం కోల్పోతే ఆ మనిషికి మరణంతో సమానమని ఈ ఘటన మరోసారి నిరూపించింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments