ఎల్బీనగర్:
చంపాపేట్ రెడ్డి బస్తి యంగ్ బాయ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చతుర్థి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.ఇందులో భాగంగా బుధవారం గణనాథునికి ప్రత్యేక పూజలు మరియు విశేష అభిషేకాలను కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పండితుల మంత్రోచ్ఛారణల నడుమ హారతి సమర్పించి, భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ పూజా కార్యక్రమంలో యూత్ అసోసియేషన్ కమిటీ సభ్యులు కృష్ణ కాంత్ యాదవ్, చంద్రకాంత్ యాదవ్, సాయి కుమార్, సందీప్, శ్రీరామ్ యాదవ్, లాల్ రెడ్డి, హరీష్, శివ యాదవ్, శివ కార్తిక్ యాదవ్, హరికృష్ణ యాదవ్, భాను ఈశ్వర్ యాదవ్ తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పూజల్లో పాల్గొని విఘ్నేశ్వరుని ఆశీస్సులు అందుకున్నారు.


