నిరసనలో పాల్గొన్న నేతలను పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు
ఎల్బీనగర్:
చైతన్యపురి డివిజన్ పరిధిలోని భవానీనగర్ కాలనీలో బస్ డిపో పక్కన ఉన్న శ్రీ సంతోషిమాత దేవాలయంలో అమ్మవారికి పూజలు జరుగుతున్న సమయంలో ఒక వ్యక్తి కర్రలతో అమ్మవారి విగ్రహంపై దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనను గడ్డిఅన్నారం డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్, బీజేపీ నాయకులు బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.దేవాలయంలో ఉన్న భక్తులు, స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో చైతన్యపురి పోలీసులు నిందితుడిని పోలీస్ స్టేషన్కు తరలించారు.అయితే దేవాలయంపై దాడి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేయగా,నిందితుడికి మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు పేర్కొన్నట్లు నాయకులు తెలిపారు.ఈ ఘటనపై నామమాత్రంగా కేసు నమోదు చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, దేవాలయంపై దాడి చేయడం భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్య అని, ఇలాంటి ఘటనలను పోలీసులు తేలికగా తీసుకోవడం సరికాదని అన్నారు. నిందితుడిపై సమగ్ర విచారణ జరిపి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, దేవాలయాలకు తగిన రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మరియు బీజేపీ నాయకులు, యువకులు దిల్సుఖ్నగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు.దేవాలయంపై దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకునే వరకు నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డిని మలక్ పేట్ పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. దేవాలయంపై దాడి ఘటనలో న్యాయం కోరుతూ నిరసన తెలిపిన వారిని పోలీసులు అరెస్టు చేయడం పట్ల బీజేపీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హిందూ దేవాలయాలపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, భక్తుల మనోభావాలను గౌరవించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రంగారెడ్డి అర్బన్ బీజేపీ అధ్యక్షులు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి, చైతన్యపురి డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ నరసింహ గుప్తా, ముసారాంబాగ్ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ బొక్క భాగ్యలక్ష్మి మధుసూదన్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు రుద్రారపు శంకర్, కుల్దీప్, డివిజన్ అధ్యక్షులు దాసరి జయప్రకాష్, నవీన్ యాదవ్, సతీష్ చారీ, సందీప్, రఘు జోషి, టింకు, శశాంక్, పవన్ తదితరులు పాల్గొన్నారు.


