- సిబ్బందికి కృతజ్ఞతలు
సిద్దిపేట:
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం కాసులాబాద్ గ్రామానికి చెందిన శ్రీనిక అనే గర్భిణీకి రెండవ కాన్పు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన మీరుదొడ్డి 108 సిబ్బంది ఆమెను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు.ఈ క్రమంలో తోర్నాల గ్రామ సమీపానికి చేరుకునే సరికి పురిటి నొప్పులు తీవ్రంగా మారడంతో, అంబులెన్స్‌లోనే 108 సిబ్బంది టెక్నీషియన్ రాజశేఖర్ సకాలంలో స్పందించి సుఖ ప్రసవం నిర్వహించారు. శ్రీనిక పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.తల్లి, శిశువు ఇద్దరూ క్షేమంగా ఉండగా, అనంతరం వారిని సమీపంలోని ప్రభుత్వ మాతా-శిశు ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు 108 సిబ్బంది రాజశేఖర్, ఎల్లంలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.


