దసరా, దీపావళి సెలవులు ముగిశాయి..
నవంబర్ లో కేవలం 12 రోజుల సాధారణ సెలవులు..
అక్టోబర్ నెల ముగిసింది. దసరా, దీపావళి సెలవులు ముగిశాయి. అయితే.. ప్రతి ఏడాది నవంబర్ నెలలో స్కూల్స్, కాలేజీలకు సెలవులు తక్కువగానే ఉంటాయి. కానీ ఈ ఏడాది నవంబర్ 2024లో స్కూల్స్, కాలేజీలకు ఓ మాదిరిగానే సెలవులు ఉన్నాయి.
గత నెల అక్టోబర్‌లో స్కూల్ విద్యార్థులకు దసరా, దీపావళి, భారీ వర్షాల నేపథ్యంలో వరుసగా సెలవులు వచ్చిన విషయం తెలిసిందే. అయితే 2024 నవంబర్‌లో మొత్తం 12 రోజుల సాధారణ సెలవులు రాబోతున్నాయి. ఈ సమయంలో దాదాపు అన్ని పాఠశాలలు, కాలేజీలకు సెలవులు రానున్నాయి. దీంతో స్కూళ్లు, కాలేజీల విద్యార్థులు మరోసారి సెలవులతో ఎంజాయ్ చేయనున్నారు.
నవంబర్ 2024లో సెలవుల విషయానికొస్తే.. నవంబర్ ప్రారంభం నుంచి గోవర్ధన్ పూజ, భైఫొంటా, ఛత్ పూజ, కార్తీక పూర్ణిమ వంటి ప్రత్యేక రోజులు జరుపుకుంటారు. ఈ రోజుల్లో చాలా స్కూల్స్, కాలేజీలకు ఇవ్వనున్నారు. అయితే ఈ సెలవులు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పట్టించుకోరు. సెలవులు కూడా ఉండకపోవచ్చు. రాష్ట్రం, నగరాన్ని బట్టి భిన్నంగా ఉంటాయి.