- 439 ఎకరాల భూముల అక్రమాలపై సమగ్ర విచారణకు ప్రభుత్వ ఆదేశం!
- అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన..
- ముప్పై రోజుల్లోగా నివేదిక సమర్పించాలని స్పష్టీకరణ!
- విచారణలో అక్రమాలు రుజువైతే భూములు స్వాధీనం చేసుకుని, నిరుపేద దళిత కుటుంబాలకు పంచుతామని ప్రకటన.
ఉద్యమ ముసుగులో పదవిని అడ్డంపెట్టుకుని వేల కోట్ల ప్రజాసొమ్మును, వందలాది ఎకరాలను కొల్లగొట్టిన కేసీఆర్ కుటుంబ బండారం అసెంబ్లీ సాక్షిగా బట్టబయలైంది. తొమ్మిది జిల్లాల్లో నాలుగు వందల ముప్పై తొమ్మిది ఎకరాల భూములను కబ్జా చేసిన పరాన్నజీవుల బాగోతంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉక్కుపాదం మోపారు. కేసీఆర్ అక్రమ సామ్రాజ్యంపై ముప్పై రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దోచుకున్న ఆ భూములన్నీ లాక్కుని, నిరుపేద దళితులకు పంచుతామని సర్కార్ గర్జించడంతో దోపిడీదారులకు వణుకు మొదలైంది!
హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రాన్ని దశాబ్దాల పాటు పాలించిన మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబంపై ప్రస్తుత ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేరున ఉన్న వేలాది కోట్ల రూపాయల విలాసవంతమైన ఫామ్‌హౌస్‌లు, వందలాది ఎకరాల భూముల అక్రమాలపై సమగ్ర దర్యాప్తునకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆదేశాలు జారీ చేశారు. శాసనసభ సాక్షిగా భూ ఆక్రమణలపై తీవ్రస్థాయిలో మండిపడిన సీఎం, ఈ విచారణలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఘాటుగా హెచ్చరించారు.

*తొమ్మిది జిల్లాల్లో నూట ముప్పై తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో అక్రమ ఆస్తులు!
తెలంగాణ ఉద్యమకారుడినని చెప్పుకుంటూ అధికారాన్ని అడ్డంపెట్టుకుని కేసీఆర్ కుటుంబం స్వల్పకాలంలోనే అందినకాడికి భూములను దోచుకుందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అధికారిక రెవెన్యూ రికార్డుల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది జిల్లాల్లో కేసీఆర్ మరియు ఆయన కుటుంబ సభ్యుల పేరుమీద ఏకంగా 439.30 ఎకరాల భూములు ఉన్నట్లు సభ దృష్టికి తీసుకువచ్చారు.
ఈ భారీ ఆస్తుల కొనుగోళ్లు, అక్రమ రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ భూముల కేటాయింపుల్లో సాగిన బాగోతాలపై పూర్తిస్థాయిలో సమగ్ర విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. ఈ దర్యాప్తునకు సంబంధించి క్షేత్రస్థాయి వాస్తవాలతో కూడిన నివేదికను సరిగ్గా 30 రోజుల్లోగా ప్రభుత్వానికి సమర్పించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.
*పేద దళితులకు పంపిణీ చేస్తాం: సీఎం హెచ్చరిక:
విచారణ పూర్తియిన వెంటనే నిబంధనల ప్రకారం అక్రమ ఆర్జనకు పాల్పడిన వారికి చట్టబద్ధమైన నోటీసులు జారీ చేస్తామని సీఎం తేల్చిచెప్పారు. విచారణలో ఆ భూములు అక్రమంగా సంపాదించినట్లు నిరూపితమైతే క్షణం కూడా ఆలస్యం చేయకుండా వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని స్పష్టం చేశారు. అలా స్వాధీనం చేసుకున్న సర్కారీ భూములన్నింటినీ రాష్ట్రంలోని నిరుపేద దళిత కుటుంబాలకు పంచడానికి తమ ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని అసెంబ్లీ వేదికగా గట్టిగా ప్రకటించారు.



