Wednesday, September 2, 2026
Google search engine
Homeతెలంగాణకరాటే విజేతలను అభినందించిన కోచ్ కే మహేశ్ నాయక్

కరాటే విజేతలను అభినందించిన కోచ్ కే మహేశ్ నాయక్

ఎల్బీనగర్:

ఇండియన్ స్టైల్ చీఫ్ బ్లాక్ బెల్ట్ కోచ్ కే మహేశ్ నాయక్ లయన్ గోజు ర్యు కరాటే ఆర్గనైజేషన్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే బెల్ట్ పరీక్ష విజయవంతంగా పూర్తయిన సందర్భంగా, ఈ పరీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలిపారు. క్రమశిక్షణ, అంకితభావం, నిరంతర సాధన మరియు పట్టుదలతో ఈ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసిన ప్రతి ఒక్కరి కృషి అభినందనీయం. ఈ సందర్భంగా కోచ్ ఎస్. ప్రసాద్,ఆర్. మహేష్,ఎన్. శివకుమార్,ఎస్. శ్రీకాంత్, అయాన్ అలీ,కోచ్ తల్హాలను అభినందించారు.మీ అందరి కృషి, సహకారం మరియు అంకితభావం లయన్ గోజు ర్యు కరాటే ఆర్గనైజేషన్ ఇండియా అభివృద్ధికి ఎంతో విలువైనవి.ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ, మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కరాటే కేవలం ఒక క్రీడ కాదు — అది క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం మరియు జీవితాన్ని గెలిచే మార్గం అని విద్యార్థులకు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments