Friday, September 4, 2026
Google search engine
Homeతెలంగాణశ్రీకృష్ణుడి బోధనలు ఆచరణీయం: గవర్నర్

శ్రీకృష్ణుడి బోధనలు ఆచరణీయం: గవర్నర్

  • జన్మాష్టమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు

హైదరాబాద్‌:

ఈ నెల 4 వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ శ్రీ శివ ప్రతాప్‌ శుక్లా శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణుడి అమూల్యమైన బోధనలు కాలపరీక్షకు నిలిచి, తరతరాలకు స్ఫూర్తినిస్తున్నాయని పేర్కొన్నారు.
ఫలితాలను ఆశించకుండా విధిని నిబద్ధతతో నిర్వర్తించాలన్న శ్రీకృష్ణుడి సందేశం నేటికీ ఎంతో
ఆచరణీయమన్నారు.
నిజాయతీ, చిత్తశుద్ధి, భక్తి, అంకితభావంతో కర్తవ్యాన్ని నిర్వర్తించాలని ఆయన బోధనలు సూచిస్తున్నాయని తెలిపారు.
శ్రీకృష్ణుడు చూపిన ధర్మం, నీతి మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని, సమాజ సేవలో నిస్వార్థంగా భాగస్వాములు కావాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు. జన్మాష్టమి పర్వదినం రాష్ట్రంలో శాంతి, సౌభ్రాతృత్వం, స్నేహభావం, సామరస్యం మరింత బలోపేతం కావడానికి దోహదపడాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments